25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 2004-05 ఏడాదిలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగ  క్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులు బడి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సమ్మేళనాలు విద్యార్థుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా పాఠశాలలో అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి కూడా సహాయపడతాయి అన్నారు. మునుముందు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా చేపడుతమని విద్యార్థులు తెలియజేశారు. అనంతరం తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సతీష్, గడ్డం స్వామి, గంగుల నరసింహులు, రాకేష్, గంగాధర్, రవి, కిరణ్, వెంకటేష్, రమేష్ విద్యార్థులు ఉన్నారు.

More articles

Latest article