24 C
Hyderabad
Sunday, August 2, 2026

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన సునీల్ రెడ్డి 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  సునీల్ కుమార్ రెడ్డి  శుక్రవారం పరామర్శించారు. సోమవారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ  మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన వార్త తెలుసుకున్న సునీల్ కుమార్ శుక్రవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసానికి వెళ్లి  ఆయనను పరామర్శించారు. లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేణు యాదవ్, ఎ ఏం సి చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారెడ్డి, సాయిరెడ్డి కార్యకర్తలు ఉన్నారు.

More articles

Latest article