27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  ఐదుగురికి గాయాలు

కామారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి పట్టణంలో దసరా పండగ నాడు జరిగిన కత్తిపోట్లు కలకలం రేపాయి. దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు రొజు మండపం వద్ధ యువకుల ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. గురువారం రాత్రి కామారెడ్డి పాత బస్టాండ్ ప్రాంతంలో దేవి నవరాత్రుల సంధర్బంగా ఎర్పాటు చేసిన మండపం వద్ధ  దాండియా అడారు. అక్కడ మద్యం మత్తులో యువకులు ఘర్షణ పడ్డారు. రెండు గ్రూప్ లు పరస్పరం దాడి చేసుకున్నారు. అందులో కోందరు కత్తులతో దాడి చేయగా రాహుల్, మణిరాజ్, మణికంఠ, కిరణ్, బాలాజీలకు కత్తుల గాయాలు అయ్యాయి. వారిని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడకి పెద్ధ ఎత్తున యువకులు చేరి గోడవపడ్డారు. పోలిసులు వారిని చెధర గోట్టారు. కామారెడ్డి పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పట్టణ సిఐ నరహరి తెలిపారు.

More articles

Latest article