నిజామాబాద్ సిటి, బతుకమ్మ : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో దశాబ్ధాలుగా సేవలందించిన ఆర్.గిరిధర్ కు ఘన సన్మానం చేశారు. ఇటీవల ఎల్లారెడ్డి డివిజన్ డిప్యూటీ ఈఈగా పని చేస్తూ ఆర్.గిరిధర్ పదవీ విరమణ పొందడంతో సిఐడి సిఐ ఆంజనేయులుతో పాటు స్నేహితులు సన్మానించారు. 41 సంవత్సరాలు పాటు పంచాయతీరాజ్ శాఖలో వివిధ హోదాల్లో పని చేసిన గిరిధర్ ఈ నెల పదవీ విరమణ పొందారు. గతంలో గిరిధర్ జనగామా, ధర్పల్లి, జక్రాన్ పల్లి, కామారెడ్డి, తాడ్వాయిలో ఏఈగా పని చేశారు. ప్రస్తుతం ఎల్లారెడ్డి పీఆర్ విభాగంలో ఈఈగా పని చేస్తూ రిటైర్డ్ అయ్యారు. దీంతో స్నేహితులు, బంధువులు ఆర్.గిరిధర్ ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భార్య ఉమాదేవి, కూతుళ్ళు ప్రవళిక, ప్రవర్ధిని, శ్రీనివాస్, ఆర్.శ్రీధర్, స్నేహితులు సిఐ ఆంజనేయులు, ఏసీటీవో విఠల్, ప్రకాష్, పోచపురం ఎల్లన్న, ఎడపల్లి నర్సింగ్ తదితరులున్నారు.
