29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలిపూల బతుకమ్మ నుండి ప్రారంభమైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగిశాయి.. మహిళలు అందరూ కలిసి తీరొక్క రంగుల పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి బతుకమ్మలను ఆయా గ్రామాలలోని ప్రధాన కూడలిలో పెట్టి బతుకమ్మ పాటలను పాడుతూ ఆటలు ఆడారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పాటలు పాడుతూ మహిళలు, చిన్నారులు, యువతులు సాస్కృతిక నృత్యాలు చేశారు.. అనంతరం ఆయా గ్రామాల చెరువులలో బతుకమ్మలను నిమర్జనం చేశారు. ఆయా గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, విద్యుత్ సిబ్బంది విద్యుత్ దీపాలను ఏర్పాటుచేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

Saddula Bathukamma celebrations in Yellareddypeta Mandal

More articles

Latest article