28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బోధన్ చక్రేశ్వర స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హనుమంతరావు

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, బోధన్: మాజీ ఎమ్యెల్యే మైనం పల్లి హనుమంతు రావు బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించి చక్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం సమీపంలో ఉన్న గోశాలను సందర్శించి గోపూజ నిర్వహించారు, అనంతరం గోశాల కమిటీ సభ్యులు మైనం పల్లి ని సన్మానించారు, అలాగే బోధన్ మాజీ మున్సిపల్ చెర్మెన్ పద్మ శరత్ రెడ్డి కుటుంబ సభ్యులను వారి నివాసంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతు రావు మాట్లాడుతూ, ఎంతో మహోన్నతమైన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చెయ్యాలని ఆకాంక్షించారు, అదేవిధంగా ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.

Mynampally Hanumantha Rao visited Bodhan Chakreswara Swamy Temple

More articles

Latest article