25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సేవాస్ఫూర్తికి చిరునామాగా బోధన్ లయన్స్ క్లబ్

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి

 

బతుకమ్మ, బోధన్‌: ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న బోధన్ లయన్స్ క్లబ్ కార్యక్రమాలు ప్రశంసనీయమని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం లయన్స్ కంటి ఆసుపత్రిలో రోగుల సేవార్థం అందుబాటులోకి తెచ్చిన కొత్త వాహనాన్ని ఆయన ప్రారంభించారు. తరువాత ఆయన మాట్లాడుతూ, “లయన్స్ క్లబ్ సమాజంలో సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఇలాంటి సేవా సంస్థలు మరింతగా ముందుకు రావాలి” అని అభినందించారు. ఇటీవల వరద ప్రభావితమైన హంగర్గ గ్రామంలోని పాఠశాలలు, గ్రామపంచాయతీకి లయన్స్ క్లబ్ ఫర్నిచర్‌ను అందజేసింది. అలాగే అంగన్వాడి కేంద్రాలకు రైస్ కుక్కర్లు, టీచర్లకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసింది. ఐఐటీలో ర్యాంకు సాధించిన ఓ విద్యార్థికి లక్ష రూపాయల విలువైన ల్యాప్‌టాప్‌ను అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Bodhan Lions Club as an address for the spirit of service

More articles

Latest article