27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటూ నిరుపేదల ఆవేదన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన కొన్ని నిరుపేద కుటుంబాలు తమకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వాలని అధికారులకు వేడుకుంటున్నారు. శుక్రవారం గ్రామంలో ఆ కుటుంబాలు తమ గోడును విలేకరులతో చెప్పుకున్నారు. సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన షేక్ జరినబెగం, షేక్ కరీం, షేక్ షాహిన్ బేగం, ఖజాపాషల కుటుంబాలు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నామని, అయినప్పటికీ తమ పేర్లు లిస్టులో రాలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, గతంలోనే తమ పేరు పై ఇల్లు వచ్చాయని, బిల్లులు కూడా వచ్చాయని అధికారులు చెబుతున్నారని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ సమస్యను పరిష్కరించి ఇప్పుడైనా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని వేడుకున్నారు.

The poor are demanding that Indiramma provide them with houses.

More articles

Latest article