బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ ఆర్టీసీ డిపో నందు బుధవారం ఆర్టీసీ మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సరిత, మహిళా కండక్టర్లు పాల్గొన్నారు.
