27.5 C
Hyderabad
Friday, July 31, 2026

‘ఓజీ’ సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

Must read

📰 Generate e-Paper Clip

  • సస్పెన్షన్లో  బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమో

 

హైదరాబాద్, బతుకమ్మ : ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ప్రస్తుత ట్రెండింగ్ మూవీ ఓజీ సినిమాకు విడుదలకు ముందే తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది. ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది టీజీ హైకోర్టు. ఈ ఆదేశం సినిమా ప్రేక్షకుల్లో చర్చనీయాంశంకాగా, ఫిల్మ్ ఇండస్ట్రీకి షాకింగ్గాగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ‘ఓజీ’ సినిమాకు ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. ఈ మెమో.. సాధారణ టికెట్ ధరలతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేసి, ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదాయం సంపాదించుకునేందుకు వీలు కల్పిస్తుంది. అయితే, ఈ నిర్ణయంపై నమోదైన కేసును పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, దీన్ని తాత్కాలికంగా ఆపేసింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని, ప్రేక్షకుల హక్కులను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది.

ఓజీ సినిమా, పవన్ కల్యాణ్ను గ్యాంగ్స్టర్ రొల్లో చూపించిన హై-యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 25. రేపు విడుదల కానున్న నేపథ్యంలో, హై కోర్టు ఆదేశం సినిమాకు భారీ ఎదురుదెబ్బగా మారింది. ఇండస్ట్రీ వర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం, కోర్టును పునర్విచారణకు పిటిషన్ వేయాలని సూచిస్తున్నాయి. బెనిఫిట్ షోలు లేకపోతే, సినిమా ప్రమోషన్, ఓపెనింగ్ డే కలెక్షన్లు దెబ్బతింటాయని నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంపు విషయం ఇదే మొదటిసారి కాదు. ముఖ్యంగా భారీ సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం ఇటీవల వివాదాస్పదంగా మారుతోంది. కాగా, రేపు (ఈనెల 25న) ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

More articles

Latest article