29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

యలమంచిలికి పోచారం గురించి మాట్లాడే అర్హత లేదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మార్కేట్ కమిటి చైర్మెన్ సురేష్ బాబా

రుద్రూర్ (వర్ని),  బతుకమ్మ  :

యలమంచిలికి పోచారం గురించి మాట్లాడే అర్హత లేదని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా అన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యలమంచిలి శ్రీనివాస్ రావు తీరుకు నిరసనగా వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ సురేష్ బాబా మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఏడు సార్లు వరుసగా గెలిపించింది నియోజకవర్గ ప్రజలేనని, రాజకీయ పరిజ్ఞానం లేకుండా యలమంచిలి శ్రీనివాస్ రావు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో యలమంచిలి శ్రీనివాసరావు పోచారం కుటుంబంపై అవాస్తవాలు మాట్లాడారని ఆయన అన్నారు. కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే పోచారం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ప్యాక్స్ అధ్యక్షుడు నేమని వీర్రాజు, మండల పార్టీ ప్రముఖులు జాకర ఫాక్స్ అధ్యక్షుడు దశరత్, మాజీ ఎంపీటీసీ బాల్ సింగ్, మండల పార్టీ నాయకులు , వర్ని మండల పరిషత్ వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మాజీ ఎంపీటీసీ బల్ సింగ్, జాకోరా మాజీ పాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కో ఆప్షన్ అబ్దుల్ కరీం, కిసాన్ కేత్ నియోజకవర్గం అధ్యక్షుడు శనిగరం కిషన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article