26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మిగిలిపోయిన వినాయక విగ్రహాలపై బీజేపీ వినతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్: బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి ఆటోనగర్‌లో రెండేళ్ల క్రితం వేసిన షెడ్‌లో తయారు చేసిన వినాయక విగ్రహాలు అమ్మకానికి మిగిలి శిధిలావస్థకు చేరుకున్నాయి. బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రదేశాన్ని పరిశీలించి, విగ్రహాలను నిమర్జనం చేయడానికి చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్‌ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు పసులోటి గోపీ కిషన్ మాట్లాడుతూ, “హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే విగ్రహాలను నిమర్జనం చేసే ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు అరవింద్, పవన్ కుమార్, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, కందికట్ల వాసు, గాదె సందీప్, గుంత గంగాధర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు గౌతం గౌడ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

BJP's request regarding remaining Ganesha idols

More articles

Latest article