బతుకమ్మ బోధన్: బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి ఆటోనగర్‌లో రెండేళ్ల క్రితం వేసిన షెడ్‌లో తయారు చేసిన వినాయక విగ్రహాలు అమ్మకానికి మిగిలి శిధిలావస్థకు చేరుకున్నాయి. బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రదేశాన్ని పరిశీలించి, విగ్రహాలను నిమర్జనం చేయడానికి చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు పసులోటి గోపీ కిషన్ మాట్లాడుతూ, “హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే విగ్రహాలను నిమర్జనం చేసే ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు అరవింద్, పవన్ కుమార్, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, కందికట్ల వాసు, గాదె సందీప్, గుంత గంగాధర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు గౌతం గౌడ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
