రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని మౌనేశ్వర్ విశ్వబ్రాహ్మణ సంఘంలో బుధవారం విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కులస్తులు గంగాధర్, రాంచందర్, లక్ష్మణ్, అనిల్, దినేష్, రాజు, శేఖర్, అశోక్, రామ్ జీ, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
