28.2 C
Hyderabad

క్రాప్ బుకింగ్ తొందరగా చేయించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : క్రాప్ బుకింగ్ తొందరగా చేయించాలని, కౌలు రైతులు సంబంధిత ఏఈఓ తో ఆన్లైన్ ఎంట్రీ చేయించాలని వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు 2025-26 మీటింగ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిన్నింగ్ మిల్లులో ఉన్న వెబ్రిడ్జి  లు, తూనికలు సరిగా ఉన్నాయా లేదా వెరిఫై చేయమన్నారు. ఫైర్ ఎక్విప్ మెంట్ అన్ని తనిఖీలు చేయాలి అని సూచించారు. మార్కెట్ యార్డ్ మరియు జిన్నింగ్ మిల్లుల వద్ద భద్రత ఏర్పాటు చేయాలి. లా అండ్ ఆర్డర్ ప్రకారం చూసుకోవాలి అని ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా, జిన్నింగ్ మిల్లు వారు , మార్కెటింగ్ డిపార్టుమెంటు  వారు కో ఆర్డినేషన్ తో ఉండమన్నారు. మీరు ప్రతీ రైతుకు సహకరించాలని, రైతులకి ఫెసిలిటీ కల్పించాలని ఎలాంటి అవకతవకలు రావద్దు అని సూచించారు. పత్తి కొనుగోలు కార్యకలాపాలను సమన్వయం చేసి, సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురావాలి అన్నారు.  పబ్లిసిటీ గురించి పోస్టర్ లు, పాంప్లెట్, గ్రామ పంచాయితీ లెవెల్ లో, లోకల్ పేపర్ , టీవీ ఛానల్ లో ప్రచారం చేయాలి అని ఆదేశించారు.

More articles

Latest article