నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఎస్ఐ నుండి ఎస్ఐపీ లుగా ఇద్దరు ప్రమోషన్ పొందిన వారు మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఏఎస్ఐ లకు ఎస్ఐపీ లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి ఏఎస్ఐ లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పదోన్నతి పొందినటువంటి వారిలో బి.బాలశౌరి రాజు ఏఎస్ఐ నుంచి ఎస్ఐపీ, ట్రాఫిక్ పీఎస్ నుండి నిజామాబాద్ కమిషనరేట్ కు, దయాల్ సింగ్ నిజామాబాద్ రూరల్ పీఎస్ నుండి నిర్మల్ జిల్లాకు కేటాయించారు.

