26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరిగింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అటవి అధికారి వికాస్ మీనా, డివిజన్ అధికారి సుధాకర్ రావు, ఆర్మూర్ డివిజన్ అధికారి భవానీ శంకర్ లు అటవి శాఖలో పని చేస్తూ విధి నిర్వహణలో అమరులైన అధికారులకు నివాళ్ళర్పించారు. నిజామాబాద్ జిల్లాలో అటవి భూములను కాపాడే ప్రయత్నంలో అసువులు బాసిన ఎఫ్ఆర్ వో గంగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగాక్షేమాలను తెలుసుకున్నారు. జాతీ సంపద అయిన అటవి ప్రాంతాన్ని, వన్యప్రాణులను, ఉత్పత్తులను కాపాడే ప్రయత్నంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ వోలు సంజయ్ గౌడ్, రాధికా, గంగాధర్, శ్రీనివాస్, రవీంధర్ లతో పాటు అటవీ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

The sacrifices of the forest martyrs are unforgettable.

More articles

Latest article