29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ  మృతి చెందిన ఘటన రుద్రూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ గ్రామానికి చెందిన గాండ్ల సాయమ్మ(55) ప్రమాదవశత్తు గ్రామ శివారులోని చెరువులో  పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు సాయమ్మ బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందినట్లు ఆమె కుమారుడు గాండ్ల శ్రావణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న వెల్లడించారు.

More articles

Latest article