వేల్పూర్, బతుకమ్మ : మండల కేంద్రంలో హెల్త్ సబ్ సెంటర్ నూతన భవన నిర్మాణం పనులకు బుధవారం ఆర్మూర్ డిప్యూటీ డీ ఏం అండ్ హెచ్ ఓ డాక్టర్. రమేష్ శంకస్థాపన చేశారు. ఈ భూమి పూజ ను నిర్వహించి మార్కౌట్ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వేల్పూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్. వీణ, పీ ఆర్ ఏ. ఈ శ్రీనివాస్,గ్రామ సంఘం అధ్యక్షులు మల్లేష్, కాంగ్రెస్ నాయకులు గడ్డం నర్సారెడ్డి, నరేందర్, రాజేందర్, చరణ్, రమణ తదితరులు పాల్గొన్నారు.
