29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్జిటియు ప్రధాన, సహాయ కార్యదర్శి ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రంలో ఎస్జిటి ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్జిటి ఉపాధ్యాయ సంఘం బిచ్కుంద మండల ప్రధాన కార్యదర్శి గా మందుల భాస్కర్ ను, సహాయ కార్యదర్శి గా దర్జీ సంతోష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ నియామకపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఎన్నికైన నాయకులు మందుల భాస్కర్, సహాయ కార్యదర్శి దర్జీ సంతోష్ మాట్లాడుతూ ఎస్జిటి సంఘం ను బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని నాపై నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి విజయ్ పాటిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్, బిచ్కుంద మండల అధ్యక్షులు షేక్ ఖయ్యుమ్, బిచ్కుంద మండల మాజీ ప్రధాన కార్యదర్శి టీ మారుతి, మండల సలహాదారు అన్సర్ గోరి, ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్ టి సంగమేశ్వర్, జిటియు బిచ్కుంద శాఖ దిశా నిర్దేశకులు జి సంతోష్, ఎస్జిటియు జిల్లా కార్యదర్శి పటేల్ హనుమంతరావు మరియు జిటి బిచ్కుంద శాఖ బాధ్యులు బుడ్డే సందీప్,హనుమాన్లు ఖాజా సహదేవ్ సాయిలు, కే సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article