26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : లెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో   జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని  కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “కాళోజి నారాయణరావు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అగ్రగణ్యులు. ఆయన రచనల్లో సమాజంలోని సమస్యలు ప్రతిఫలించాయి. ప్రజల కోసం, తెలుగు సాహిత్యం కోసం చేసిన కృషి చిరస్మరణీయం” అని వివరించారు. అనంతరం సాహిత్య వర్గ ప్రతినిధులు మాట్లాడుతూ “కాళోజి తన కవిత్వంతో ప్రజల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలకు స్వరమిచ్చారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డిబిసిడిఓ జయరాజ్ అసిస్టెంట్ బిసిడిఓ చక్రధర్, సాహితీ మిత్రులు, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య,నాగభూషణం, గంగారాం, నాగరాజు, నరేష్, పవన్ అశ్వక్, జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

Kaloji Narayana Rao's birth anniversary celebrated with great pomp

More articles

Latest article