25.3 C
Hyderabad

కవితక్క వెంటే ఉంటా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ లేఖను పోస్టు ద్వారా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపించారు.  ఈ సందర్భంగా మగ్గరి హన్మండ్లు మాట్లాడుతూ  మా నాయకురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధకరమన్నారు. కవితక్క కు బీఆర్ఎస్ పార్టీ లో జరిగిన అన్యాయనికి నిరసనగా తాను బీఆర్ఎస్ పార్టీకి  రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. కవితక్క బాటలోనే తాను నడుస్తానని, ఆమె నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.

 

More articles

Latest article