27.5 C
Hyderabad
Friday, July 31, 2026

అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు లైట్ల వితరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో రాత్రిపూట చీకటిగా ఉండడంతో సమస్యను ప్రధానోపాధ్యాయులు రామచందర్రావు అమ్మ ఫౌండేషన్ సభ్యులకు తెలియజేశారు. అమ్మ ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి లైట్లను శుక్రవారం అందజేశారు. విద్యార్థులకు విద్య పట్ల ఎలాంటి సమస్యలు ఉన్న అమ్మ ఫౌండేషన్ తరపున సహాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అమ్మ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More articles

Latest article