- ‘బతుకమ్మ’ కథనానికి స్పందించిన అధికారులు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామంలో త్రాగునీటి ట్యాంకుల ద్వారా కలుషితమైన త్రాగునీరు వస్తుందని, ఈ నీరు త్రాగడం వలన రోగాల బారిన పడుతున్నామని, “పర్యవేక్షణ లోపం.. కలుషితమవుతున్న త్రాగునీరు” అనే శీర్షికపై బుధవారం బతుకమ్మ పత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి అధికారులు స్పందించారు. గురువారం గ్రామపంచాయతీ కార్మికులతో త్రాగు నీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నారు. త్రాగు నీటి ట్యాంకులను శుభ్రం చేయించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తు బతుకమ్మ పత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
