- శ్రీరాంపూర్ లో జరిగిన హెచ్ఎంఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక
- నాయిని నర్సింహారెడ్డి తర్వాత హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్ష పదవి ఎన్నికైన రెండో బీఆర్ఎస్ నేత కవిత
శ్రీరాంపూర్, బతుకమ్మ : సింగరేణిలోని హెచ్ఎంఎస్ (ది సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్) గౌరవ అధ్యక్షురాలిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో నిర్వహించిన హెచ్ఎంఎస్ జనరల్ బాడీ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కవిత ను గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకుంటున్నట్టు ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
- ఈ సమావేశంలో చేసిన ప్రధాన తీర్మానాలు ఇవే..
1) పాత వీఆర్ఎస్ స్కీమ్ ని పునరుద్ధరించడం
2) వేలంపాట లేకుండా తెలంగాణ బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించడం
3) సింగరేణి కార్మికులకు పెర్క్స్
రియంబర్స్మెంట్ క్రింద ఐటీ రిటర్న్స్ ఇప్పించడం
4) సింగరేణిలో అలియాస్ నేమకనిపించడమారుపేరుల సమస్యతో) బాధపడుతున్న కార్మికులను వన్ టైం సెటిల్మెంట్ కింద క్రమబద్ధీకరించడం
5) అనారోగ్య సమస్యలతో అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయి సర్ఫేస్ ఫిట్ తీసుకున్న సింగరేణి కార్మికునికి బేసిక్ ప్రొటెక్షన్ మరియు సూటబుల్ జాబ్ ఇప్పించడం
6) కార్మికులకి సొంత ఇంటి పథకం అమలు చేయడం
7) సింగరేణిలో పెండింగ్ విజిలెన్స్ కేసులను క్రమబద్ధీకరించడం
8) జైపూర్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న భూనిర్వాసితులకు రెగ్యులరైజ్ చేయడం
9) సింగరేణి కార్మికులకు కంపెనీ లాభాల వాటా 35% ఇప్పించడం
10) సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కి కంపెనీ లాభాల్లో 10% వాటా ఇప్పించడం
11) సింగరేణిలో పనిచేస్తున్న మహిళలకి వాళ్ళ విద్యార్హతకి తగిన ఉద్యోగాలు కనిపించడం
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి హోం మంత్రిగా పని చేసిన కాలం వరకు హెచ్ఎంఎస్ కు గౌరవ అధ్యక్షులుగా నాయిని నర్సింహారెడ్డి పని చేశారు. ఆయన తర్వాత హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా గౌరవం పొందిన రెండో బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కవిత.
