- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్
- వర్చువల్ గా లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం
నిజామాబాద్, బతుకమ్మ : సైనికుల సంక్షేమార్థం లీగల్ సర్వీసెస్ క్లినిక్ లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ పాట్రన్ ఇన్ చీఫ్,జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ లోని హైకోర్టు ప్రాంగణం నుండి వర్చువల్ విధానంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ను నిజామాబాద్ నగరంలోని సైనిక సంక్షేమ బోర్డ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరీ లతో కలిసి ప్రారంభించి ప్రసంగించారు. జాతీయ న్యాయసేవ ప్రాధికార సంస్థ నాల్సా జాతిజనులకు న్యాయసేవలను విసృత పరచాలానే ఆశయసిద్ధిలో మరో మైలురాయిగా నిలిచి ఉంటుందని ఆయన తెలిపారు. సైనిక సంక్షేమ బోర్డ్ లకు అందించే న్యాయసేవలు సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనకారిగా నిలుస్తాయని జస్టిస్ ఎకె సింగ్ తెలియజేశారు.న్యాయసేవాధికార సంస్థ ద్వారా పారా లీగల్ వాలంటీర్లు, ప్యానల్ అడ్వకేట్స్ న్యాయార్థులకు న్యాయసేవలు అందించడంలో ముందు వరుసలో ఉన్నారని ఆయన అన్నారు.కొట్లాది మంది దేశ ప్రజలకు న్యాయవారధిగా న్యాయసేవ సంస్థ నీలుస్తోందాన్ని పేర్కొన్నారు.నూతన సాంకేతిక పరిజ్ఞానంను అందిపుచ్చుకుని న్యాయసేవలు అనే మహాత్తర కార్యక్రమాన్ని అందిస్తున్నట్లు జస్టిస్ సింగ్ తెలిపారు.అనంతరం జిల్లా ఇంచార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి. శ్రీనివాస్ మాట్లాడుతూ సైనికుల సంక్షేమ బోర్డ్ లోని ప్రతివారికి లీగల్ సర్వీసెస్ క్లినిక్ ద్వారా న్యాయసేవలు చేరువ కావడం శుభ సంకేతమని అన్నారు. బోర్డ్ లోని ప్రతి సభ్యుడు న్యాయసేవలను వినియోగించుకుని అన్ని రకాల ప్రయోజనకారులు కావాలని ఆయన ఆశించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతు అందరికి ఉచిత న్యాయసేవలు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. బోర్డ్ కార్యాలయంలో న్యాయవాది బాలరాజ్ నాయక్ ను ప్యానల్ న్యాయవాదిగా నియమించినట్లు ఆయన తెలిపారు.కార్యక్రమంలో సైనిక సంక్షేమ బోర్డ్ ఇంచార్జి ఆంజనేయులు,చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉదయ కృష్ణ, మహ్మద్ షాదుల్ల, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శుభం, ప్యానల్ న్యాయవాది బాలరాజ్ నాయక్,సైనిక సంక్షేమ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.

