25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా

 

భీమ్ గల్, బతుకమ్మ : వినాయక నిమజ్జనం కోసం భీమ్ గల్ పట్టణ రాగన్న చెరువు నిమజ్జన ప్రాంతంలో కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చెయ్యాలని ఆర్మూర్ డివిజన్ సబ్ కలెక్టర్ స్థానిక అధికారులను ఆదేశించారు. మంగళవారం సబ్ కలెక్టర్ రాగన్న చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనం చేసే ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ దీపాలు,  గజ ఈతగాళ్లను,  క్రేన్ ను, భారీ గేట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగడానికి మంచినీరు, మెడికల్ కిట్ ను అందుబాటులో ఉంచాలన్నారు. గుంతలు ఉన్న ప్రాంతంలో మొరం పోయాలని ఆదేశించారు. వినాయకుని నిమజ్జనానికి అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్. ఆర్మూర్ ఏ సీ పీ వెంకటేశ్వర రెడ్డి . తాసిల్దార్ షబ్బీర్. ఎంపీడీవో సంతోష్ కుమార్. ఎస్సై సందీప్. నాయకులు ప్రజా ప్రతినిధులు విద్యుత్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Strict arrangements should be made for immersion

More articles

Latest article