26.6 C
Hyderabad
Monday, August 3, 2026

27న ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ  ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 7:30 గంటలకు బాన్సువాడ మండలంలోని తాడ్కోల్​ జర్నలిస్టు కాలనీలోని వినాయక మండపం వద్ద డీఎస్పీ విటల్ రెడ్డి చేతుల మీదుగా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని ప్రెస్ క్లబ్  అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. రోజు ఇండ్లలో గణపతులను పెట్టుకుని పూజించే భక్తులు మట్టి గణపతులను తీసుకువెళ్లాల్సిందిగా కోరారు. మట్టి గణపతిని పూజించడం వలన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కృత్రిమ రంగులతో తయారుచేసిన గణపతులను చెరువులో వేయడం వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు.నీటిలో ఉండే జీవరాశులు మృతి చెందే అవకాశం ఉంది. అందువల్లే మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

More articles

Latest article