- లోకల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్ పర్సన్ చంద్రకళ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలల్లో, దివ్యాంగులకు మంచి సేవలు అందుతున్నాయని లోకల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్ పర్సన్ చంద్రకళ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, దివ్యాంగుల పాఠశాలలో అందుల ప్రత్యేక పాఠశాల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వారు మానసికంగా, సాంస్కృతికంగా, విద్యా పరంగా అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారని అన్నారు. కళ్ళు ఉండి తెలివి లేని వారు, తెలివి ఉండి కళ్ళు లేని వారికి, విద్యను అందిస్తున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు జ్యోతి సిద్దయ్య లకు ఆమె అభినందనలు తెలిపారు. అందుల ప్రత్యేక పాఠశాలలో అంద విద్యార్థులు తమ అద్భుతమైన గాత్రంతో ఆలపిస్తున్న పాటలు ఎంతో మధురంగా ఉన్నాయని, అందరినీ ఆకట్టుకుంటున్నాయని ఆమె కొనియాడారు. దివ్యాంగుల స్వయం సమృద్ధిలో తల్లిదండ్రుల పాత్రను పోషిస్తున్న సిద్దయ్య జ్యోతిలు నిజంగా అభినందనీయులు అన్నారు. అందులు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలని ఆమె ఆకాంక్షించారు. స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ అందుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని ముఖ్యంగా సైన్స్ లో జాతీయస్థాయిలో అంధ విద్యార్థి పాల్గొన్నదని, చెస్ లో రాష్ట్రస్థాయిలో తమ పాఠశాల అంద విద్యార్థులు బంగారు పథకాన్ని వెండి పథకాన్ని సాధించారని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలలో, యోగాలో అంధ విద్యార్థులు తమ ప్రతిభను చూపిస్తున్నారని ఆయన తెలిపారు. గత సంవత్సరం అందులో పాఠశాల విద్యాశాఖ ద్వారా గుర్తింపు పొంది అందులకు సేవల ను అందిస్తుందని, ఇప్పటివరకు తమ పాఠశాలలో చదువుకున్న 30 మంది అంధ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ఆయన తెలిపారు. అందుల కోసం ఇంకా తమ సేవలను విస్తృత పరుస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, లోకల్ ప్రాజెక్టు కమిటీ సభ్యులు సుధా ఉపాధ్యాయురాలు, అబ్రహం మరియు ఇస్రాత్ బేగం తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంధ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో లోకల్ ప్రాజెక్టు కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంధుల ప్రత్యేక పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

