నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని దుర్గాదేవి ఆలయంలో సోమవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదినం సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మణికంఠ శర్మ అర్చనలు నిర్వహించారు. ఈసందర్భంగా విజయ్ కృష్ణ మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎన్నో ఉన్నత పదవులు పొందాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. బూత్ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తల కు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. పసి పిల్లల ప్రాణాలు కాపాడుతూ వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమం లో ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదశివా, ధాత్రిక రాజేందర్, గంగోనె శ్రీనివాస్, దయవార్ గంగాధర్, గంగోనె రాజు, భక్తలు పాల్గొన్నారు.
