23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

రామయ్యకు పర్యాటక శోభ

Must read

📰 Generate e-Paper Clip

  • పక్క జిల్లాల నుంచి పర్యాటకులు రాక

 

మెండోరా, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 39 గేట్లని ఎత్తి నీటిని గోదావరిలోకి వదలడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో చేయరా సాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకుంది. ఎస్సారెస్పీ జలదృశ్యాలను, గోదావరి నది పరవాళ్లను,  ప్రాజెక్టు అందాలను తిలకించడానికి స్థానిక నిజామాబాద్, హైదరాబాద్,  నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల్, మంచిర్యాల్, అదిలాబాద్ తదితర జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రాజెక్టు దగ్గర సెల్ఫీలు దిగుతూ కొందరు, జలదృశ్యాలను చరవాణిలో బంధిస్తూ కొందరు, ప్రాజెక్టుపై సేద తీరుతూ కొందరు సంతోషంగా గడుపుతున్నారు.

Tourist attraction for Ramaiah

More articles

Latest article