బోధన్ , బతుకమ్మ : బోధన్ మండలంలోని భవానిపేట గ్రామంలో గూఢచారి పావురం అని ప్రచారం కలకలం రేపింది. గ్రామంలో ఓ బాలుడికి ఈపావురం దొరికింది. పావురం కాలికి కోడ్ రింగ్ ఉండడంతో గూఢాచారి పావురం ప్రచారం జరగడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. అది గూఢాచారి పావురం కాదని, రేసింగ్ పావురంగా గుర్తించినట్లు తెలిపారు.

