బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలోని షర్బతి కెనాల్ చౌరస్తా వద్ద కల్వర్ట్ మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులను షర్బతి కెనాల్ బస్ డిపో వెనుక దారి ద్వారా మళ్లిస్తున్నారు. అయితే ఆ రహదారి పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ వెంటనే స్పందించి డిపో వెనకాల రహదారిపై చిప్స్ డస్ట్ వేసి మరమ్మత్తు పనులు చేపట్టారు. దీనితో వాహనదారులకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
