- మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్
డిచ్ పల్లి, బతుకమ్మ : సిఎంసి మెడికల్ కాలేజ్, హాస్పిటల్ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో నిర్వహించే సంస్థ అని దీనిని పునః ప్రారంభిస్తున్నామని, మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ పేర్కొన్నారు. గతంలో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. డిష్పల్లి మండల కేంద్రంలోని సిఎంసి మెడికల్ కళాశాల హాస్పిటల్ లో సి ఎస్ ఐ మెదక్ డయాసిస్ మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సిఎంసి మెడికల్ కళాశాల స్థానికుల అభివృద్ధి కోసం ప్రారంభించడం జరిగిందని కొన్ని అనివార్య కార్యాల వల్ల మూతపడిందని తెలిపారు. దానిని పునః ప్రారంభం చేస్తున్నామని ముందుగా హాస్పిటల్ నిర్వహణ కోసం డాక్టర్ అజ్జ శ్రీనివాస్ బృందం, హాస్పిటల్ నిర్వాహణ చేస్తుందని, 2025 2026 అకాడమిక్ ఇయర్ లో మెడికల్ నర్సింగ్ కాలేజ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. వచ్చే అకాడమీ ఇయర్లో మెడికల్ కళాశాలను పూర్తిస్థాయి, అనుమతులతో ప్రారంభించుకుంటామని అన్నారు. సిఎంసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సీఎస్ఐ మెదక్ డయాసిస్ బాధ్యత అని డాక్టర్ అజ్జ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎస్ఐ మెదక్ డయాసిస్ పర్యవేక్షణలో హాస్పిటల్ నిర్వహణ జరుగుతున్నదని బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ తో పాటు బోర్డు మెంబర్లు ప్రసాద్, రావుల సాంసంన్, పాస్టర్ రవరెంట్ ఏసు కుమార్, మెట్టు సాంసంన్, డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సుమన్, సి ఎం సి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
