29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇస్కాన్ కంటేశ్వర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ కంటేశ్వర్ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జన్మాష్టమి కార్యక్రమాలను నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కేంద్ర నిర్వాహకుడు రామానందరాయ గౌరదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటల వరకు అభిషేకము హారతి మహా అన్న ప్రసాదము సాంస్కృతిక కార్యక్రమాలు ఊయల సేవా , జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. లోక కళ్యాణం కోసము భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తి సమస్త ప్రాణికోటిని తన యొక్క లీలామృతంతో పునీతులను చేసిన పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఈ యొక్క అతి పవిత్రమైన కార్యక్రమంలో ఇందూరు నగర ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పోటీలు అందరినీ ఆకర్షిస్తాయని పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాదాసు స్వామి యాదవ్, నీతాయి చంద్ ప్రభు, బలరాం ప్రభు, రామానంద గోపేస్ ప్రభు, ప్రాణప్రియ ప్రభు, సర్వానంత ప్రభు మరియు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article