30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బంగారు భవిష్యత్ కోసం మరింత శ్రమించాలి

Must read

📰 Generate e-Paper Clip

రాజ్యాంగం కల్పించిన హక్కులను పౌరులు వినియోగించుకోవాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ

 నిజామాబాద్, బతుకమ్మ :  భారతవని బంగారు భవిష్యత్ కోసం మరింత శ్రమించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలో శుక్రవారం 79 వ భారత స్వాతంత్య దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆమె న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా ప్రజలకు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ను పౌరులు  వినియోగించుకోవాలన్నారు.  శాసన వ్యవస్థలు చేసిన చట్టాలు ప్రజల ప్రగతికి ఇతోదిక సహాయకారాలుగా ఉన్నాయని అన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛ లకు, జీవనానికి ముప్పు ఏర్పడిన సందర్భాలలో న్యాయస్థానాలు రక్షణ కవచాలుగా ఉన్న చారిత్రత్మాక తీరులను గుర్తు చేశారు.  గ్రామాలలో అసమానతలు లేని, ఆధిపత్యం లేని సమానత కోసం, అందరు కలిసికట్టుగా ఉండి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలానే న్యాయసేవ సంస్థ ఆశయానికి తోడ్పాటును అందించాలని ఆమె జిల్లా ప్రజలను కోరారు.  కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జీలు ఆశాలత, హరీష, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ, హరి కుమార్, ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు మామిళ్ళ సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు దిలీప్,న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article