24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మయసభలో బీసీ బిడ్డకు ఘోర అవమానం

Must read

📰 Generate e-Paper Clip

  • మయసభలో ఇందూర్ బిసీ నేత సీన్ పై తీవ్ర అభ్యంతరం
  • వెబ్ సిరిస్ పై బీసీ సంఘాల ఆగ్రహం
  • ఫ్యాక్షన్ నేతల ఎలివేట్ చేసేందుకు బీసీ నేతను అవమానించారంటున్ననెటిజన్లు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ:  ‘మయసభ’ వెబ్ సీరీస్ మూవీ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన మయసభ వెబ్ సీరీస్ సినిమాలో తెలంగాణకు చెందిన ఉద్యమ నేత, బీసీ నేత రోల్ కించపరిచేదిగా ఉందని బహుజన నాయకులు మండిపడుతున్నారు. ఇటీవల విడుదలైన మయసభ సీరీస్ లో పాత్రల పేర్లు మార్చినప్పటికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఆంధ్ర సీయం చంద్రబాబు నాయుడి పోలికలతో సీరీస్ సాగుతుంది. ఇద్దరు నేతలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఎదుగుదల క్రమాన్ని చూపేందుకు డైరెక్టర్ బీసీ నేతను అవమానించారని బీసీ నాయకులు మండిపడుతున్నారు.

మయసభ వెబ్ సిరిస్ లో వైఎస్సార్, చంద్రబాబు పోలికలు కలిగిన పాత్రలతో పాటు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆహార్యం కలిగినట్టు చూపించారు. అయితే ఆనాడు రాజకీయ వేత్తలపై తీసిని కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతర వ్యక్తమౌతుంది. ఆనాడు తెలంగాణలో బలమైన బీసీ నాయకుడుగా ఉన్న వ్యక్తి అప్పటి పీయం ఇందిరాగాంధీ కాళ్ల వద్ద సీయం పదవికోసం మోకరిల్లినట్లు చూపించిన సీన్ పై బీసీ నాయకులు మండిపడుతున్నారు. ఈ వెబ్ సీరీస్ లో చూపించిన బీసీ నేత, దివంగత మాజీ మంత్రి గడ్డం(అర్గుల్) రాజారాంను పోలి ఉండటం వివాదానికి కారణమైంది. తెలంగాణాలో ఆనాడు తిరుగలేని నాయకుడిగా ఉన్న వ్యక్తి సీయం కుర్చీ కోసం ఆనాటి ప్రధాని కాళ్లపై పడ్డట్లు చూపించడం ఆయనను ఘోరంగా అవమానించడమేనని బీసీ నేతలు మండిపడుతున్నారు.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర (తొలి) ఉద్యమంలో బీసీ నేత అర్గుల్ రాజారాం ప్రముఖులు. నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ గడ్డం రాజారాం అనే పేరు కన్న తన సొంతూరు అర్గుల్ పేరుమీదనే అర్గుల్ రాజారాం అంటేనే ప్రసిద్ధి చెందిన బహుజన ముద్దుబిడ్డ. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఆయనను మించిన బీసీ నేతలు లేరంటే అతిశయోక్తి కాదు. అర్గుల్ రాజారాం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ టూగా చలామణి అయ్యారు. ముందుగా జయప్రకాష్ నారాయణ స్పూర్తితో సోషలిస్టు నాయకుడిగా జీవితంను ఆరంభించి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత కాంగ్రెస్ పార్టీ తరుపున బాల్కొండ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అర్గుల్ రాజారాం కు ధర్మపురి శ్రీనివాస్(డిఎస్), శనిగరం సంతోష్ రెడ్డిలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు చాలామంది ఆయన శిష్యులే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా (ఒకసారి ఏకగ్రీవంగా) ఎన్నికై పలువురు సీయం ల హయాంలో కేబినేట్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండగానే రామాయం పేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అసువులు బాసారు. ఏనాడు మంత్రి పదవులు ఆశించని అర్గుల్ రాజారాం తన కాళ్లవద్ధకు వచ్చిన సీయం పదవిని త్రుణికరించారని అప్పుడే మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారనే విషయం చాలమంది పాత తరం లీడర్లకు తెలుసు. తన కోసం ఏదీ మిగిల్చుకోని నేత పేరు మీదనే జిల్లాలో అర్గుల్ రాజారాం ఎత్తిపోతల పధకం అని ఉమ్మడి రాష్ట్రంలోనే పేరు పెట్టారు అంటే ఆయన చేసిన సేవలు మరువలేనివి అని చెబుతారు.

దేవాకట్ట దర్శకత్వంలో తీసిన మయసభ అగ్రవర్ణాల లీడర్లను మొసేందుకు (ఎలివేట్ చేసేందుకు) బిసీ నేతను అవమానించే విధంగా సీన్లను తీశారని నిజామాబాద్ కు చెందిన బీసీ సంఘాల నాయకులు నరాల సుధాకర్, శ్రీనివాస్ గౌడ్, ఆదే ప్రవీణ్ లు మండిపడ్డారు. రాజకీయాల విషయంలో తీసే సినిమాలు ఎవ్వరిని కించపరిచే విధంగా ఉండవద్దని కాని డైరెక్టర్ తన పరిధిని దాటి బీసీ నేతను అవమానించారని మండిపడుతున్నారు. బీసీ నేతను కించపరిచే విధంగా ఉన్న సీన్లను తొలిగించాలని  లేకపోతే ఆందోళనకు పిలుపునిస్తామని అన్నారు. ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన నేతలను ఎలివేట్ చేసేందుకు సోషలిస్టు భావాలు కలిగిన నేతను, తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన కారుడిని అవమానిస్తే చూస్తు ఉరుకోమని అన్నారు. మయసభలోని అభ్యంతరకర సీన్లను తొలిగించాల్సిందేనని  డిమాండ్ చేస్తున్నారు.

A BC child was severely insulted in the Maya Sabha.

More articles

Latest article