26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇళ్ళ పేరిట అక్రమంగా ఇసుక డంపులు

Must read

📰 Generate e-Paper Clip

  • చోద్యం చూస్తున్న అధికారులు..

 

రుద్రూర్, బతుకమ్మ : రోజు రోజుకు ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కొందరు అక్రమార్కులు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట అక్రమంగా ఇసుక రవాణా చేస్తు ఇసుక డంపులు చేపడుతున్నారు. రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో కొందరు అక్రమార్కులు అక్రమంగా పలు ప్రాంతాలలో ఇసుక డంపులు చేపడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట అనుమతులు తీసుకుని, ట్రాక్టర్ లలో ఇసుకను తరలిస్తు అక్రమంగా డంపులు చేపడుతూ రాత్రి వేళల్లో నిజామాబాద్ వైపు తిప్పర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుక డంపులు చేపడుతున్న అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.

Illegal sand dumps in the name of Indiramma's houses

More articles

Latest article