నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందూర్ ఫుట్ బాల్ అకాడమీ వారు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించిన ఫుట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఇందూర్ జిల్లా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పెట్టింది పేరన్నారు. క్రీడాలను ప్రోత్సాహించడం వల్ల విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృడంగా ఉంటారన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం

జరిగిందన్నారు. త్వరలో స్టేడియం నిర్మాణం జరిగేలా కృషి చేస్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాల పట్ల ప్రత్యేక ద్రుష్టి పెట్టి క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలతో పాటు కోచ్ లను నియమించాలని అన్నారు. ఇందూర్ బిడ్డలు జాతీయ, అంతర్జాతీయ, ఓలంపిక్స్ స్థాయిలో రానించి ఇందూర్ జిల్లాకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 35 వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుదీర్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ, బీజేపీ నాయకులు, మరవర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

