26.3 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థినిలు తమ సమస్యలను పీడీఎస్ యూ దృష్టికి తీసుకురావాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  లక్షలాది రూపాయలు పెట్టీ కార్పొరేట్ విద్యాసంస్థల హాస్టల్స్ లో విద్యను అభ్యసిస్తూ ఉంటున్న విద్యార్థి విద్యార్థినులు తమ సమస్యలను పీడీఎస్ యూ  దృష్టికి తీసుకురావాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సు కోసం విద్యార్థుల పక్షాన పి డి ఎస్ యూ  విద్యార్థి సంఘం నిరంతం పోరాడుతుందని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. లక్షల రూపాయలు విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నటువంటి ప్రవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థులకు కనీస సౌకర్యాలు  ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధించాలని సూచించారు. అనుమతి లేని ప్రైవేట్ జూనియర్ కళాశాలల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పులు చేస్తున్న లెక్చరర్స్ ను గాని సిబ్బంది నీ గాని వెనకేసుకొస్తే చూస్తూ ఊరుకోమని చట్టపరమైన చర్యల అమలు కోసం పోరాడుదామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, తే,యూ నాయకులు గౌతం రాజ్,నగర నాయకులు దుర్గాప్రసాద్,విజయ్,ప్రశాంత్,బాలు, సాయి,రాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article