26.7 C
Hyderabad

ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని కాపాడిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ : మెండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఆత్మహత్య చేసుకోవడానికి వస్తున్నాడని సమాచారం తెలుసుకున్న ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమై వ్యక్తిని రక్షించినట్లు ఆమె పేర్కొన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం వర్ని మండలం అంతాపూర్ తాండకు చెందిన బొంతు మహేష్ ఆత్మహత్య చేసుకోవడానికి వస్తున్నారని తెలుసుకొని ప్రాజెక్టుకు వెళ్లే అన్ని రోడ్ల పైన తనిఖీలు చేపట్టారు. పోచంపాడు ఎక్స్ రోడ్ వద్ద మహేష్ను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

More articles

Latest article