27.4 C
Hyderabad

పర్మిషన్ కోసం పడిగాపులు

Must read

📰 Generate e-Paper Clip

  • సరిహద్దుల పంచాయతీతో నిలిచిన ట్రాక్టర్లు

 

బతుకమ్మ, కోటగిరి : ఇసుక తరలింపు విషయంలో రెండు గ్రామాలలో సరిహద్దుల పంచాయతీ విషయంలో  70 ఇసుక ట్రాక్టర్లు రోడ్డుపై నిలిచిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇసుక తరలింపు విషయంలో తమ గ్రామ శివారు 334 సర్వే నంబర్ నుండి అక్రమంగా  ఇసుక తరలిస్తున్నారని  కోడిచర్ల గ్రామస్తులు సోమవారం రోజున తాసిల్దార్ గంగాధర్ కు ఫిర్యాదు చేశారు. పోతంగల్ గ్రామానికి చెందిన  ట్రాక్టర్ యజమానులకు రెవిన్యూ అధికారులు పర్మిషన్  ఇస్తామని చెప్పడంతోనే  తాము ఇసుక ను లోడ్ చేసుకొని  మంజీరా నది సుమారు 75 ట్రాక్టర్ వరకు  బ్రిడ్జ్ పై ఉంచి అధికారులకు వే బిల్లుల కోసం ఎదురుచూస్తున్న  వే బిల్లులు ఇవ్వడం లేదంటూ  ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Rushing for permission

More articles

Latest article