27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉరివేసుకొని వివాహిత మృతి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : గత కొంత కాలంగా మానసిక వ్యాధితో భాధపడుతూ ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని  మృతి చెందిన ఘటన మండలంలోని బెజ్జోరా గ్రామంలో శనివారం చోటు చేసుకొంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బెజ్జోరా గ్రామ తాజా మాజీ సర్పంచ్, వివాహిత ప్రతిభ (35) గత కొంత కాలంగా మానసిక వ్యాధితో భాధపడుతోంది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరు లేని సమయం లో ఉరివేసుకొని చనిపోయింది. ఈ విషయమై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.శవ పంచానామా నిర్వహించిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article