27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రైనేజీలు నిర్మించండి మహా ప్రభు..

Must read

📰 Generate e-Paper Clip

  • డ్రైనేజీలు లేక ఇళ్ళలోకి వచ్చి చేరుతున్న వర్షపు నీరు..

 

రుద్రూర్, బతుకమ్మ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి డ్రైనేజీలు లేక ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతున్నాయని అంబం గ్రామస్తులు వాపోయారు. రుద్రూర్ మండలం అంబం(ఆర్) గ్రామంలోని పలు కాలనీల్లో డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, డ్రైనేజీలు నిర్మించండి మహాప్రభు అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

More articles

Latest article