రుద్రూర్, బతుకమ్మ: తహసీల్దార్ కార్యాలయంలో సాధారణంగా రాత్రి వేళల్లో అధికారులు ఉండరు. కానీ రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు రాత్రి వేళల్లో కూడా విధులు నిర్వహించడంతో స్థానిక ప్రజలు అధికారుల పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజుల నుండి రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తు అధికారులు ఎంతో శ్రమిస్తున్నారని, అధికారుల పనితీరు పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
