28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

31నుంచి పీజీ, ఎల్ఎల్బీ పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ  పరిధిలోని పిజి, ఎల్ఎల్బి పరీక్ష తేదీని పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్యకే సంపత్ కుమార్ తెలిపారు. పీజీ–ఎల్.ఎల్.బీ. ఆరవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఎల్.ఎల్.బీ. (5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) ఐఎంబిఏ, ఏపీ ఈ, ఐపిసిహెచ్ ఐదవ  సెమిస్టర్, ఏపీఈ, ఐపిసిహెచ్  ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు 2025 జూలై 24వ తేదీ నుండి 2025 జూలై 30వ తేదీ వరకు ఉండగా ఈ పరీక్ష తేదీని పొడిగిస్తూ 31 జులై నుండి 14 ఆగస్టు వరకు నిర్వహించబడతాయనీ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్ లో పొందుపరచినట్లు పేర్కొన్నారు.

More articles

Latest article