- దేవుని పల్లి మెడికల్ ఆఫీసర్ కు సైతం
- దేవుని పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి అదేశాలు జారీచేసిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి, బతుకమ్మ : డిప్యూటీ డీఎంహెచ్ఓకు, దేవుని పల్లి మెడికల్ ఆఫీసర్ కు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ దేవుని పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి నందు వైద్యాధికారి, డిప్యూటీ డిఎంహెచ్ఓ దోమకొండ హాజరు లేనందున వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. వర్షాకాలం వ్యాధులు అధికంగా ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రి పరిసరాలు, ఆస్పత్రిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచి వైద్య సేవల కోసం వచ్చిన రోగులకు వైద్యసేవలు అందించాలని అన్నారు. ఆకస్మిక తనిఖీలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

