28.8 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ జిల్లాకు మరో కొత్త రైల్వేలైన్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ మీదుగా  పటాన్ చెరు – ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు

ఎంపీ అర్వింద్ కి లేఖ ద్వారా తెలియజేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో రైల్వే సౌకర్యాలు విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్ కి ముందడుగు పడింది. గత రెండేళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు – ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని పలుమార్లు కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ  ప్రాజెక్టు మంజూరైందని రైల్వే మంత్రి వైష్ణవ్, ఎంపీ అర్వింద్ కి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారు చేస్తున్నారని, డీపీఆర్ పూర్తయిన తర్వాత  తదుపరి చర్యలు చేపడతామని మంత్రి లేఖలో పేర్కొన్నారు. కాగా తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అర్వింద్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.

Another new railway line for Nizamabad district

More articles

Latest article