రామారెడ్డి, బతుకమ్మ : రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామం లోని యువకులు రోడ్డు పై మొరం తో గుంతలు పూడ్చారు. అంతే కాకుండా గ్రామ ప్రధాన రోడ్డు పక్కన లోతైన గుంతలను 60 ట్రిప్పుల మొరం నింపారు. జేసీబీ ల సహాయంతో రోడ్డుకు చుట్టుపక్కల ఇరుకుగా ఉండి ప్రమాదాలు జరగడం వల్ల మొరం తో వెడల్పు చేశారు. ట్రాక్టర్ సహాయం తో చెట్ల కొమ్మలు పిచ్చి మొక్కలు తీసివేశారు. భవిష్యత్తు లో బస్ షెల్టర్ నిర్మాణం చేస్తామని తెలిపారు. ఎవ్వరి సహాయం లేకుండా స్వచ్చందంగా చేయడం చూసి గ్రామం ప్రజలు రోడ్డుపై వెళ్లే ఇతర బాటసారులు యువకుల శ్రమదానం చూసి శభాష్ అని మెచ్చుకుంటున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉమా దత్తాద్రి, మాజీ వీడిసి అధ్యక్షులు జరా స్వామి, గ్రామం మాజీ వార్డ్ మెంబెర్ గున్నాల రామగౌడ్, భజన మండలి నాయకుడు కుమ్మరి దత్తాద్రి, మాజీ తెలంగాణ ఉద్యమకారుడు మెరుగు చిన్న రాజేందర్, గ్రామం యువ నాయకుడు మ్యాదరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
