25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామంలోని చావిడి ఎల్లమ్మ దేవాలయం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సోమవారం బీఆర్ఎస్ పార్టీ బలోపేతం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పథకాలను వివరించారు. అదేవిధంగా పార్టీ బలోపేతం గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దౌర్ సాయిలు, బొట్టే గజేందర్, సాయి కిరణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article